Header Banner

అమెరికా కీలక నిర్ణయం.. ఆ విద్యార్థులే లక్ష్యంగా స్టూడెంట్ వీసాలపై నిఘా! రూబియో సంచలన ప్రకటన!

  Thu May 29, 2025 11:41        U S A

విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా స్పందించింది. తమ దేశ విద్యార్థుల ప్రయోజనాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ "అంతర్జాతీయ విద్యార్థులతో పాటు చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను కోరుతున్నాం" అని అన్నారు. ఇరు దేశాల మధ్య విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

 

ఇది కూడా చదవండి: అమెరికాలో మళ్లీ కరోనా కల్లోలం.. వారానికి సగటున 350 వరకు కొవిడ్ మరణాలు నమోదు!

 

పరిశోధనా రంగాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న చైనా విద్యార్థులతో పాటు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోందని యూఎస్ సెనేటర్ మార్కో రూబియో ఇటీవల ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ తర్వాత చైనా విద్యార్థులే అధిక సంఖ్యలో ఉన్నారు. విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో భాగంగా వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంపై అమెరికా దృష్టి సారించింది. దీని కోసం "సోషల్ మీడియా వెట్టింగ్" అనే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆన్‌లైన్ కార్యకలాపాలను అధికారులు పరిశీలిస్తారు. వారి సోషల్ మీడియా ప్రొఫైళ్లను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వీసా మంజూరు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు ఇవ్వడాన్ని నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో ఈ తాత్కాలిక నిలిపివేత అమల్లోకి వచ్చింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNewShip #NewShip #USANews #Travel #World #BigShip #Titanic #TitanicShip #TitanicBigShip